మహిళ సర్పంచ్ పై దురుద్దేశపూర్వక ఆరోపణలు మానుకోవాలి - గ్రామ పెద్దలు

  • 06. November 2025
  • ShaTv News
జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో మైనారిటీ మహిళ సర్పంచ్ షేక్.హస్మతూన్,వార్డు సభ్యులు పెద్దలతో ప్రెస్ మీట్ పెట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముక్త్యాల గ్రామంలో కొందరు వ్యక్తులు మహిళ సర్పంచ్ అని చూడకుండా పనికట్టుకుని వ్యక్తి గతంగా పలు ఆరోపణలను చేస్తున్నారని ఆమె తీవ్రంగా ఆవేదనతో ఖండించారు.మైనార్టీ లో మహిళలే బయటకు రావడం లేదని,అలాంటిది గ్రామ పంచాయతీ సర్పంచి గా మైనారిటీ మహిళ అయిన ఆమె నేను రావడాని స్వాగతించాలని ఆమె అన్నారు.గ్రామ సర్పంచి గా గ్రామంలో గ్రామ పెద్దలు,వార్డు సభ్యుల ఆమోదంతోనే స్థానిక శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ ప్రోత్సాహం తో ప్రభుత్వ నుంచి వచ్చిన నిధులను గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగిందని ఆమె అన్నారు.

అటువంటి ఆమె పై,వారి కుటుంబ సభ్యులు,పంచాయతీ కార్యవర్గ సభ్యుల పై రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళా సర్పంచ్ అని చూడకుండా,గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మాపై దురిద్దేశం తో కొందరు ఓర్వలేక ఆరోపణలు చేయడం సరైంది పద్దతీ కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ అభివృద్దిని గ్రామ ప్రజలను అడిగితే తెలుస్తుందని,ఎవ్వరు ఎటువంటి వారో గ్రామ పెద్దలకు,ప్రజలకు తెలుసునని ఆమె అన్నారు.ఇప్పటికైన మైనార్టీ మహిళా సర్పంచ్ గా ఉన్న ఆమె పై,నా కుంటుంబ సభ్యుల పై,మా గ్రామ పంచాయతీ కార్యవర్గ సభ్యుల పై అవాస్తవ ఆరోపణలు ప్రచారం చేయడం మానుకోవాలని,గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆమె కన్నీటి పర్యాంతం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.ఈ సందర్భంగా 2 వ వార్డు సభ్యులు పులుసు ప్రియాంకా,విద్యా కమిటీ ఛైర్మన్ మోకా సత్యనారాయణ,గ్రామ పెద్దలు దాది వెంకట నర్సయ్య పెనుమత్సా వర్మా ,మత్సా ప్రసాద్ లు సైతం మాట్లాడుతూ సర్పంచి పై కొందరు దురుద్దేశం పూర్వకంగా చేస్తున్న ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు.ఆరోపణలు చేసే వ్యక్తులు గ్రామ అభివృద్ది,ప్రజా శ్రేయస్సు కోసం అందరు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మొగల్ నాగుల్ మీరా,కంటు గోపినాథ్,కందుకూరి శ్రీనివాసరావు,పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Ta strona używa plików cookie. Kontynuując korzystanie z tej witryny, wyrażasz zgodę na używanie przez nas plików cookie.
Czytaj więcej Zgadzam się